ETV Bharat / state

తాళి కట్టిన చేయి.. తాడు బిగించింది!

పక్షవాతంతో భార్య మంచం పట్టింది.. ఆమెకు సపర్యలు చేసిన భర్త అనుకోని ప్రమాదంతో తానూ మంచానికే పరిమితమయ్యాడు. నరకయాతన అనుభవిస్తున్న భార్య ఒకవైపు.. తనకేమీ చేయలేకపోతున్నాననే బాధ మరోవైపు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ సంఘర్షణ ఆయన్ను కఠిన నిర్ణయం తీసుకునేలా చేసింది. తాళి కట్టిన చేత్తోనే.. దాన్ని తెంచేలా చేసింది. ఇద్దరూ కలిసి ఆఖరి మజిలీకి ప్రయాణమయ్యేందుకు దారితీసింది. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగింది.

husband killed wife in kamareddy district

author img

By

Published : May 26, 2021, 2:34 PM IST

తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి మండలంలో చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన శంకర్‌గారి సిద్ధయ్య(65)ది వ్యవసాయ కుటుంబం. ఆయన భార్య బాలామణి(56) నాలుగేళ్ల క్రితం పక్షవాతంతో మంచం పట్టింది. కుమారుడు రాజు ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లడంతో సిద్ధయ్య, ఆయన కోడలు ఆమెకు సపర్యలు చేసేవారు. కొద్ది రోజుల క్రితం సిద్ధయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తర్వాత అనారోగ్యం పాలై కదల్లేని స్థితికి చేరారు.

ఒకవైపు కళ్లెదుటే భార్య పడుతున్న అవస్థలు.. మరోవైపు ఆమెకు ఏమీ చేయలేననే నిస్సహాయత. తమ పరిస్థితి కుమారుడికి, కోడలికి భారంగా మారిందనే బాధ ఇంకోవైపు. ఈ పరిణామాలతో కొన్నాళ్లుగా మానసిక సంఘర్షణకు గురవుతూ వస్తున్న ఆయన ఈ సమస్యలన్నింటికీ చావే పరిష్కారమనే నిర్ణయానికొచ్చారు. మంగళవారం భార్యను మంచం పక్కనే ఉన్న కిటికీ ఊచలకు ఉరివేసి చంపాడు. అనంతరం ఇంట్లోని ఫ్యానుకు ఉరిపోసుకొని తానూ చనిపోయాడు. అత్త కిటికీకి వేలాడుతుండటాన్ని పక్కింట్లో ఉండే కోడలు గమనించి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరిచింది. అప్పటికే ఇద్దరూ చనిపోవడంతో నిర్ఘాంతపోయారు. కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు దేవునిపల్లి ఎస్సై రవికుమార్‌ తెలిపారు. కుమార్తె పెళ్లి కోసం ఇటీవలే గల్ఫ్‌ నుంచి వచ్చానని, నాలుగు రోజల క్రితమే పెళ్లి ఘనంగా జరిపించానని, ఇంతలోనే ఇలా జరిగిందని రాజు కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదీ చూడండి:

మీ ఫోన్​లో ఆక్సీమీటర్ యాప్ ఉందా..? అయితే జాగ్రత్త

నగరం నడిబొడ్డున హత్య.. గొంతు కోసి పరారైన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.