ETV Bharat / state

మడకశిరలో బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు - child marriage news in madakasira

అనంతపురం జిల్లా మడకశిరలో బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. అధికారులు బాలిక నివాసం వద్దకు వెళ్లి ఆమె తల్లిదండ్రులకు చట్టాల గురించి వివరించి వివాహం రద్దు చేయించారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేస్తామని తల్లిదండ్రులు రాతపూర్వకంగా తెలపటంతో బాలికను వారికి అప్పగించారు.

మడకశిరలో బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు

author img

By

Published : Feb 15, 2020, 3:52 PM IST

మడకశిరలో బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు

అనంతపురం జిల్లా మడకశిరలో పదో తరగతి చదువుతున్న ఓ బాలికకు వివాహం చేసేందుకు ఆమె తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. సమీప బంధువుల అబ్బాయితో నిశ్చితార్థం నిర్వహించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు బాలిక ఇంటికి వచ్చి వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులకు చట్టాల గురించి వివరించి వివాహం రద్దు చేయించారు. అనంతరం బాలికను స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారికి అప్పగించారు. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేస్తామని తల్లిదండ్రులు రాతపూర్వకంగా తెలిపి అధికారులను వేడుకోవడంతో బాలికను వారికి అప్పగించారు.

ఇదీ చూడండి: కన్నతల్లి కర్కశత్వం... చిన్నారికి బాల్య వివాహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.