అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలో బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. స్థానిక ముసలమ్మ కట్ట దగ్గర కాశీ విశ్వేశ్వర దేవాలయంలో వివాహం జరుగుతుండగా... అధికారులు చేరుకొని అడ్డుకున్నారు. అధికారులు వివాహా స్థలానికి చేరుకోకముందే పెళ్లి జరిగిపోయింది. అనంతరం బాలికను చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌కు తీసుకెళ్లారు. బాలిక వయస్సు 16 సంవత్సరాల 11 నెలలని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు