ఉదయం వేళల్లో పాలు, పండ్లు, కూరగాయలు కొనుగోలు అవకాశం కల్పించారు. కూరగాయల మార్కెట్ స్థలం ప్రజలకు సరిపోక పాత బస్టాండ్‌కు మార్పించారు. ప్రజలు సామాజిక దూరం పాటించేందుకు మార్కింగ్ వేశారు. క్యూలైన్లో నిలబడి కూరగాయలు, పండ్లు కొనుగోలు చేశారు. ప్రభుత్వం కనీస సౌకర్యాలతో పాటు కూరగాయలు, నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలు అందరూ సహకరించాలని రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు, సీఐ తులసిరామ్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాప్తి దృష్ట్యా పుట్టపర్తిలో అప్రమత్తం