భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు నగదు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన రమేశ్అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు.
పోలీసుల వివరాల ప్రకారం..
కడదరకుంటా గ్రామానికి చెందిన సంజప్పకు ఇద్దరు కుమారులు. సంజప్పకు అనంతపురంలో ఉన్న 1.6 ఎకరాలను 2012లో జిల్లా కేంద్రానికి చెందిన గౌరీశంకర్, డి.వి నాయుడుకు విక్రయించారు. ఇవ్వాల్సిన నగదు మొత్తానికి ప్రామిసరీ నోట్లు రాయించుకుని పెద్ద కుమారుడు సురేశ్, చిన్న కుమారుడు రమేశ్‌కు అందజేశారు. దీనికి సంబంధించి రమేశ్‌కు 30 లక్షల నగదు రావాల్సి ఉంది.
భూమి కొనుగోలు చేసిన వ్యక్తులను పలుమార్లు అడిగినా.. రెండు నెలల కిందట 5 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగతా 25 లక్షలు ఇచ్చేది లేదని చెప్పడంతో రమేశ్ మనస్తాపానికి గురై బలవర్మరణానికి పాల్పడ్డాడు. భర్త ఇంటికి రాలేదని వెతుకుతుండగా..మామిడి తోటలో అతడి మృతదేహం కనిపించింది. భార్య ఫిర్యాదు మేరకు గౌరీశంకర్, డి.వి. నాయుడుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మల్యే పయ్యావుల కేశవ్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇదీ చదవండి: