ETV Bharat / state

ఎన్టీఆర్ వర్ధంతిలో వైకాపాపై పరిటాల శ్రీరామ్ విమర్శలు.. - వైకాపా నేతలపై మండిపడ్డ పరిటాల శ్రీ రామ్

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్​ మాట్లాడుతూ జాకీ సంస్థ భూములను వైకాపా నేతలు కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

paritala sriaram speach
ఎన్టీఆర్ వర్ధంతిలో పరిటాల శ్రీరామ్
author img

By

Published : Jan 18, 2021, 11:01 PM IST

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఎన్టీఆర్​ను ప్రజలు 25 ఏళ్ల తరువాత కూడా గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన పరిపాలనా దక్షతే అందుకు నిదర్శనమన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్​దేనని శ్రీరామ్ అన్నారు.

శిలా ఫలకాలు పగులగొడితే తెదేపా చేసిన అభివృద్ధి ఎక్కడికీ పోదని పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు. తామేసిన రోడ్లపై వైకాపా నాయకులు చిల్లరేరుకుంటున్నారని ఆరోపించారు. తాము రాష్ట్రానికి జాకీ కంపెనీని తీసుకొస్తే.. కంపెనీ యాజమాన్యాన్ని భూముల నుంచి వెళ్లగొట్టిన ఘనత వైకాపాదని ఎద్దేవా చేశారు. కుటుంబ సభ్యుల పేరుతో ఓ సహకార సంఘం ఏర్పాటు చేసి.. అనంతపురం జిల్లాలో జాకీకి కేటాయించిన భూములను సంఘం పేరుమీదకు బదిలీ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికార పార్టీ నేతలపై ఆరోపించారు.

ఇదీ చదవండి: మంత్రి కొడాలి నానిని అరెస్టు చేయాలి: వర్ల రామయ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.