ETV Bharat / state

tdp leader: ఐ-తెదేపా అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకు నోటీసులు - Andhrapradesh news

tdp leader undavalli anusha అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే పద్మావతిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారన్న అభియోగంపై ఐ-తెదేపా అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల ఐడీలు తనవి కావన్నారు. ఎవరో ఫిర్యాదు చేస్తే అనంతపురం నుంచి పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని అనూష ఆగ్రహం వ్యక్తం చేశారు.

notices to tdp leader undavalli anusha
ఐ-తెదేపా అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకు పోలీసులు నోటీసులు
author img

By

Published : Sep 7, 2022, 11:37 AM IST

notices to tdp leader అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే పద్మావతిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారన్న అభియోగంపై ఐ-తెదేపా అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏలూరులోని ఆర్​ఆర్​ పేటలో ఆమె వస్త్ర దుకాణానికి వచ్చిన అనంతపురం పోలీసులు.. 41ఏ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన అనూష.. పోలీసులు తనకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్న సామాజిక మాధ్యమాల ఐడీలు తనవి కావన్నారు. ఎవరో ఫిర్యాదు చేస్తే అనంతపురం నుంచి పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు. అయితే, పద్మావతిపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ భీమిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో శింగనమల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.