అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కదిరి మండలం యర్ర దొడ్డి పంచాయతీకి తెదేపా మద్దతుదారు లక్ష్మీదేవమ్మ, కుమ్మర వాండ్లపల్లి పంచాయతీకి వైకాపా మద్దతుదారు శాంతమ్మ భాయి తమ నామినేషన్లను సమర్పించారు. తనకల్లు మండలం కొక్కంటి పంచాయతీకి వైకాపా మద్దతుదారు మల్లేశ్వరి, కొర్తికోటపంచాయితీకి లక్ష్మీ నరసమ్మ, శ్యామలమ్మ నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
పుట్టపర్తి నియోజకవర్గంలో మొత్తం 80 పంచాయతీలు ఉండగా.. వాటిలో 10స్థానాలకు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా, వైకాపా మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఇద్దరూ పుట్టపర్తిలో ఉంటూనే పంచాయతీ ఎన్నికలపై నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఏకగ్రీవ పంచాయతీలపై దృష్టిపెట్టాలి: ఎస్ఈసీ