ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని.. అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది పట్టణంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. పొగ తాగడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పొగాకు నివారణ గురించి చైతన్యం తీసుకురావాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ఇవి చదవండి...విద్యార్థులను కూలీలు చేసిన విద్యాశాఖ!