తాడిపత్రిలో ఎక్స్అఫీషియో ఓటుకు ఎమ్మెల్యే, ఎంపీలకు మాత్రమే అర్హత ఉన్నట్టు అక్కడి మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఈ మేరకు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసిన నలుగురు ఎమ్మెల్సీలకూ అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి రాయదుర్గంలో ఓటు హక్కుతో ఎమ్మెల్సీ అయ్యారని చెప్పారు. ఈ కారణంగా.. తాడిపత్రిలో ఎక్స్అఫీషియో ఓటుకు దరఖాస్తును తిరస్కరించామన్నారు. దరఖాస్తు చేసిన ఇతర ఎమ్మెల్సీలు గోపాల్‌రెడ్డి, ఇక్బాల్ అహ్మద్, శమంతకమణికి సైతం అవకాశం లేదని చెప్పారు.
ఇదీ చదవండి: