నివర్ తుపాన్ ప్రభావంతో అనంతపురంలో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఉదయం నుంచి చలిగాలులు, కమ్మేసిన మబ్బులతో ప్రజలు బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఏ క్షణాన తుపాను బీభత్సం సృష్టిస్తుందోనని రోడ్లపైకి రావడం లేదు. రాత్రి నుంచి చిన్నపాటి చినుకులతో వర్షం పడుతోంది. పట్టణంలో తుపాను ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్నట్లు అధికారులు ప్రజలను హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవీ చదవండి: