ETV Bharat / state

జంట హత్యల కేసు.. 9 మంది అరెస్టు - two murder case updates in anantapur district

అనంతపురం జిల్లా యోగి వేమన జలాశయం వద్ద జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు... హత్యకు ఉపయోగించిన కొడవలి, కర్రను స్వాధీనం చేసుకున్నారు.

police
జంట హత్యల కేసులో తొమ్మిది మంది అరెస్టు
author img

By

Published : May 22, 2021, 2:04 PM IST

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం యోగివేమన జలాశయం వద్ద జరిగిన ఇద్దరి హత్యల కేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దిగువ పల్లికి చెందిన కేశవ్.. అతని మేనమామ గంగరాజు ద్విచక్ర వాహనంలో గ్రామానికి వెళ్తుండగా వారిని కేశవ్ దాయాదులైన శివయ్య, రామచంద్రతో పాటు మరో ఏడుగురు కొడవళ్లతో దాడి చేసి నరికి చంపారని పోలీసులు తెలిపారు.

"శివయ్య భార్యకు సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే కారణంతో అతన్ని హత్య చేసేందుకు కేశవను శివయ్య సంప్రదించాడు. అందుకు అతడు నిరాకరించాడు. సూర్యనారాయణతో అప్పటికే సన్నిహితంగా మెలుగుతున్న కేశవ్.. హత్య కుట్రపై సమాచారం ఇచ్చాడు. ఈ విషయం తెలిసి.. శివయ్య, అతని బంధువులు కలసి కేశవ్​ను హతమార్చారు. అడ్డువచ్చిన గంగరాజును సైతం చంపేశారు. నిందితుల నుంచి వేట కొడవలితో పాటు హత్యకు ఉపయోగించిన కర్రను పోలీసులు స్వాధీనం చేసుకుని... రిమాండ్​కు తరలించారు" అని డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:

వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.