ETV Bharat / state

పెన్నా అహోబిలంలో ఘనంగా నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన - flagpole installation news

అనంతపురం జిల్లా పెన్నా అహోబిలంలోని శ్రీ ఉద్భవ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ స్థాపన శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమేష్​ బాబు, చైర్మన్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

new flagpole installation
నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన
author img

By

Published : Dec 17, 2020, 6:03 PM IST

ఉరవకొండ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నా అహోబిలం శ్రీ ఉద్భవ లక్ష్మీదేవి అమ్మవారి గుడిలో ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 8:00 - 8:36 నిమిషాల మధ్య ధనుర్​ లగ్నమందు ప్రతిష్ఠ చేశారు. ధ్వజ స్తంభానికి కుంభవాహనం, మహా మంగళహారతి, ఆచార్య బహుమానం, తీర్ధ ప్రసాద వినియోగం, మహాదాశీర్వచనాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో రమేష్ బాబు, చైర్మన్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: దుండగుల దుశ్చర్య.. చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.