అనంతపురం జిల్లాను ఎడతెరిపిలేని వర్షాలు ముంచెత్తాయి. ఈ వర్షాలకు గొర్రెలకు నీలి నాలుక వ్యాధి సోకింది. ఫలితంగా జీవాలు నీరసించి, మృత్యువాత పడుతున్నాయి. ఇలా ప్రతి మందలో పది నుంచి 40 గొర్రెల వరకు చనిపోతున్న కారణంగా.. గొర్రెల కాపర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు.
నిర్లక్ష్యంతోనే...
గొర్రెలకు ఏటా జూన్, జూలై నెలల్లో నీలినాలుక వ్యాధి రాకుండా పశుసంవర్థకశాఖ టీకాలు వేస్తోంది. ఈ ఏడాది వర్షాలు కురవవన్న దీమాతో ఉన్న కాపర్లు... జీవాలకు టీకాలు వేయించకుడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. ఫలితంగా గొర్రెల మందలకు ఈ వ్యాధి వ్యాపించింది.
అధిక వర్షాలతోనే...
అధిక వర్షాలు కురిసిన సమయంలో... గొర్రెలకు ఈ వ్యాధి అధికంగా సోకుతుందని పశుసంవర్థకశాఖ అధికారులు తెలిపారు. వ్యాధి సోకిన జీవాలను మందతో తీసుకెళ్లకుండా, వైద్యం అందిస్తే మరణాల సంఖ్య తగ్గించవచ్చని సూచిస్తున్నారు. సొంత వైద్యం చేయకుండా పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లాలని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: