అనంతపురం జిల్లా మడకశిర మండలం గుడిదనహల్లిలో అబ్కారీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అనిల్ అనే వ్యక్తి వద్ద 25 కర్ణాటక మద్యం పాకెట్లు, గురుదత్త అనే వ్యక్తి వద్ద 5 లీటర్ల నాటుసారా లభ్యమైంది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నాటుసారా, కర్ణాటక మద్యం అమ్మిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఈనెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 18న బడ్జెట్