అనంతపురం జిల్లా కదిరి మండలం కారెడ్డిపల్లి తాండా, కుమ్మరవాండ్లపల్లి ప్రాంతాల్లో సారా తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి వినియోగించే సామగ్రిని ధ్వంసం చేశారు. 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొన్నారు. సారాను తయారు చేసేందుకు నిల్వ ఉంచిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. గ్రామాలకు సమీపంలో అటవీ ప్రాంతాల్లో సారాను తయారు చేస్తున్నారని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య