గుంతకల్లులో 500 మీటర్ల జాతీయ జెండా ఊరేగింపు
గుంతకల్లులో 500 మీటర్ల జాతీయ జెండా ఊరేగింపు - national flag rally
రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంతకల్లు పట్టణంలో 500 మీటర్ల జాతీయ జెండాను ఊరేగించారు. వైకాపా నాయకుడు వై. మంజునాథ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
![గుంతకల్లులో 500 మీటర్ల జాతీయ జెండా ఊరేగింపు national flag rally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5839642-708-5839642-1579961012443.jpg?imwidth=3840)
గుంతకల్లులో 500 మీటర్ల జాతీయ జెండా ఊరేగింపు
గుంతకల్లులో 500 మీటర్ల జాతీయ జెండా ఊరేగింపు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో రేపు జరగబోయే 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 500 మీటర్ల జాతీయ జెండాను ఊరేగించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైకాపా నాయకుడు వై. మంజునాథ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వివిధ పాఠశాలలకు చెందిన సుమారు రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని టీవీ టవర్ నుండి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ మీదుగా పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ఈ ర్యాలీ జరిగింది. అనంతరం అబ్దుల్ కలాం ఆజాద్ మరియు పొట్టి శ్రీరాములు విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
sample description
TAGGED:
national flag rally