.
అనంతపురంలో ఘనంగా నాగాభరణ ఉత్సవం - అనంతపురంలో నాగాభరణ ఉత్సవం
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో గవిమఠం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శనివారం రాత్రి నాగాభరణ ఉత్సవం నిర్వహించారు. స్వామి వారి మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని నాగాభరణంపై ఉంచి ఊరేగించారు. మేళతాళాల నడుమ స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి చిన్న రథంపై కొలువుదీర్చారు. ఈ కార్యక్రమంలో గవిమఠం ఉత్తరాధికారి శ్రీ కరిబసవ రాజేంద్రస్వామి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
అనంతపురంలో ఘనంగా నాగాభరణ ఉత్సవం
.