అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో 30 సంవత్సరాలుగా దాయాదుల మధ్య భూ తగాదాలు ఉన్నాయి. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని ఓ వర్గం వారు వ్యవసాయం చేయటానికి వెళితే మరో వర్గం వారు దాడి చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన రామదాసు, కిష్టప్ప, పద్మ, బాబు, శ్రావణి, రమేష్, శీన, మంజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అనిశా తనిఖీలు