సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం మహిళల ర్యాలీ - muslim womans protest news in ananthapuram
ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా అనంతపురంలో ముస్లిం మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు.