ETV Bharat / state

గుప్త నిధులపై ఆశలు... తీస్తున్నాయి ప్రాణాలు - అనంతపురం

కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఒకప్పుడు ఫ్యాక్షన్‌తో రక్తం చిందేది. ఇప్పుడు అత్యాశ, మూఢనమ్మకాలతో హత్యలు జరుగుతున్నాయి. పురాతన కట్టడాలను తవ్వితే గుప్త నిధులు ఉంటాయన్న దురాశ.. కొందర్ని నరబలలు తీసుకునేలా పురిగొల్పుతున్నాయి. ఇటీవల అనంతలో ఇలాంటి హత్యలు జరుగుతుండడం కలకలం రేపుతోంది.

గుప్త నిధులపై ఆశలు... తీస్తున్నాయవి ప్రాణాలు
author img

By

Published : Jul 15, 2019, 6:18 PM IST

అనంతపురం జిల్లాలో చాలా గ్రామాల్లో రాజులు నిర్మించిన ఆలయాలు ఉన్నాయి. నిర్మాణ సమయంలో అంతర్భాగంలో నిధులు ఉంచి ఉంటారనే అభిప్రాయం బలంగా ఉంది. కొంత మంది స్వార్థపరులు శిథిలావస్థకు చేరిన ఆలయాలపై కన్నేసి తవ్వేస్తున్నారు. ముఠాలుగా ఏర్పడి కట్టడాలు ధ్వంసం చేస్తున్నారు. నిధులు దొరకుతున్నాయని ప్రచారంతో మరికొందరు ఈ పనికి పూనుకుంటున్నారు. ఈ నిధుల కోసం అన్వేషించేటప్పుడు నరబలి ఇవ్వాలని కొందరి నమ్మకం. అందుకే ఇలాంటి హత్యలు ఇక్కడ నిత్యం కనిపిస్తున్నాయి.

నర బలికి కొందరి ప్రాణాలు పోతుంటే... వాటాలు ఇవ్వాల్సి వస్తుందనే దురాశతో ఇంకొన్ని హత్యలు జరుగుతున్నాయి. ఇలానే పెనుకొండలో రాయల రెండో రాజధానిని గుప్తనిధుల వేటగాళ్లు ధ్వంసం చేశారు. గుత్తికోట, రాయదుర్గం, ఉరవకొండ, మడకశిర, లేపాక్షి తదితర ప్రాంతాల్లోనే ఎన్నో కట్టడాలు నేలకూల్చారు.

కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండలం కొర్తికోట గ్రామ శివాలయంలో జరిగిన మూడు హత్యలు అందర్నీ భయాందోళనకు గురి చేశాయి. శివాలయానికి పూజారిగా ఉన్న శివరామిరెడ్డి అతని సోదరి కమలమ్మ, మరో సమీప బంధువు సత్యలక్ష్మిని గొంతు కోసి చంపేశారు.

ఇలాంటి హత్యలతో చారిత్రక కట్టడాలు ఉన్న ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

గుప్త నిధులపై ఆశలు... తీస్తున్నాయవి ప్రాణాలు

ఇవీ చదవండి..

అన్ని పార్టీల్లోనూ వాళ్లుంటారు కదా!... చంద్రబాబుతో కోటంరెడ్డి మాటామంతీ...

Intro:Ap_Vsp_61_15_Freedom_Fighter_Tilak_99th_Jayanthi_Ab_C8_AP10150

Body:ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు విజయనగరం తొలి పార్లమెంట్ సభ్యుడు కందాల సుబ్రహ్మణ్యం తిలక్ 99 వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు నగరంలోని ఓ హోటల్లో తెలుగు శక్తి ఆధ్వర్యంలో తిలక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొని అంజలి ఘటించారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తిలక్ చేసిన సేవలు మరువలేనివని మానవతా వాదిగా ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పాటుపడే తిలక్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా ఏదో ఒక ప్రభుత్వ పథకానికి తిలక్ పేరు పెట్టాలని అని డిమాండ్ చేశారు
---------
బైట్ కె.విజయలక్ష్మి తిలక్ సోదరి
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.