తన భార్యతో చనువుగా ఉన్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేశాడు మరో వ్యక్తి. ఈ ఘటన తనకల్లు మండలం పరాకులవాండ్లపల్లిలో చోటు చేసుకుంది. పరాకులవాండ్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య... తన భార్యతో చనువుగా ఉంటున్నాడని గణేష్ అనుమానం పెంచుకున్నాడు. లక్ష్మయ్యపై దాడి చేసేందుకు గణేష్ మరో ముగ్గురితో కలిసి గ్రామ శివారుకు రావాలని ఫోన్ చేశారు. కాని లక్ష్మయ్య నిరాకరించడం వల్ల.. అతని ఇంటి వద్దకే వెళ్లి బయటకు రమ్మని పిలిచారు. గణేశ్‌తో వచ్చిన వంశీ... లక్ష్మయ్యతో మాట్లాడుతుండగా గణేశ్ కత్తితో దాడి చేశాడు. తేరుకున్న లక్ష్మయ్య వారిని పక్కకు తోసి అక్కడ నుంచి తప్పించుకున్నాడు. అదే సమయంలో లక్ష్మయ్య భార్య కేకలు వేయడం వల్ల దాడికి యత్నించిన వారు అక్కడ నుంచి పరారయ్యారు. గాయపడిన లక్ష్మయ్యను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :