మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా... అనంతపురం జిల్లా గుంతకల్లులో సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట పాడై పోయిన తోపుడుబండ్లతో ఆందోళనకు దిగారు.
కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, రెడ్ జోన్లో పనిచేసే వారికి అదనపు వేతనం, పీపీఈ కిట్లు అందజేయాలని, కొత్త పనిముట్లు ఇవ్వాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.
న్యాయమైన డిమాండ్లతో 13 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపడుతుంటే ప్రభుత్వానికి చలనం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: