అనంతపురం జిల్లా పరిగిలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. హైదరాబాద్లోని పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి డంపింగ్ యార్డులో వేయాటాన్ని ఖండించారు. కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని చెత్త కుప్పలో వేయటం దారుణమన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
ఇదీ చదవండి... శ్రీలంక పేలుళ్ల నుంచి బయటపడ్డ విజయవాడ వాసులు