ETV Bharat / state

మాస్క్ ధరించండి.. కరోనా నివారణకు సహకరించండి: ఎంపీ గోరంట్ల - mp advised every one to wear mask in wake of corona second wave

అనంతపురంలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ గోరంట్ల మాధవ్​... అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. కరోనా కట్టడికి అందరూ సహకరించి మాస్క్​ తప్పక ధరించాలని సూచించారు.

gorantla madhav on corona awareness
మాస్క్ ధరించండి.. కరోనా నివారణకు సహకరించండి
author img

By

Published : Apr 7, 2021, 5:10 PM IST

ప్రతి ఒక్కరూ మాస్క్​ తప్పక ధరించి కరోనా నివారణకు సహకరించాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని ప్రెస్ ​క్లబ్​ లో నగరానికి చెందిన రచయిత పిల్ల కుమారస్వామి రచించిన ఆరోగ్య జీవనం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ప్రపంచంలో కరోనా మహమ్మారి చేరి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిందన్నారు. ఆరోగ్య జీవనం అనే పుస్తకంలో ప్రస్తుత సమాజంలో మానవులు ఎటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను క్లుప్తంగా ప్రచురించారని తెలిపారు. ఆరోగ్య సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి:

సచివాలయానికి తాళం వేసిన సర్పంచ్ అనుచరులు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.