Movie Style Murder Case in Anantapur: అనంతపురం జిల్లాలో దృశ్యం తరహాలో ఓ వ్యక్తిని హత్య చేసి ఆనవాలు లేకుండా చేసిన కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ ఘటనలో 11మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్సీ అన్బురాజన్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
హత్యకు గురైన మహమ్మద్ అలీ, నిందితుడు షేక్ మహమ్మద్ రఫీ గతంలో మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి పలు సంస్థలు పెట్టి వ్యాపారం చేసి పెద్ద మొత్తంలో నష్టపోయారు. కాగా రఫీ వల్లే నష్టం జరిగిందని, డబ్బును తిరిగివ్వాలని అలీ ఒత్తిడి తెచ్చేవాడు. పలు సందర్భాల్లో రఫీ ఇంటికి అలీ వెళ్లి ఇంట్లో మహిళలతో అనుచితంగా ప్రవర్తించేవాడు. ఇది సహించలేని రఫీ ఎలాగైనా అలీని హత్య చేయాలని కుట్ర పన్నాడు.
తనకు తెలిసిన శివరామ్‌తో విషయం చెప్పి సహాయం కోరాడు. సుపారీ గ్యాంగ్‌ను పంపుతానని శివరాం మహమ్మద్ రఫీకి చెప్పాడు. అందుకోసం అడ్వాన్సుగా 50వేల రూపాయలు తీసుకున్నాడు. హత్య చేసేందుకు శివరాం కొందరు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని అలీని అనంతపురంలోని ఓ ఫర్నీచర్ గోదాంకు పిలిపించారు.
కారులో వచ్చాడు- తుపాకీతో కాల్చాడు- పారిపోయాడు
దీంతో అక్కడకు వచ్చిన అలీని విపరీంతగా కొట్టి హత్య చేశారు. సినిమా తరహాలో అలీ మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేయాలని రఫీ భావించాడు. రఫీ సోదరి కరిష్మాను గోదాం వద్దకు పిలిపించి ఇద్దరూ కలిసి అలీ మృతదేహాన్ని కారులో గిద్దరూలు వైరు తరలించారు. అయితే మార్గమధ్యలో కారు రిపేరు వచ్చి మొరాయించడంతో తిరిగి అనంతపురం వైపు వచ్చారు. స్థానికులు సహాయం చేసి కారును తోసినా పనిచేయకపోవటంతో అంబులెన్సును పిలిపించారు.
ఈ క్రమంలో కారు వెనుక సీట్లో ఉన్న మృతదేహంపై స్థానికులు సందేహం వ్యక్తం చేయగా తన బంధువు మృతి చెందాడని రఫీ, కరిష్మా చెప్పారు. అలీ శవాన్ని అనంతపురం తెచ్చి ఆనవాళ్లు లేకుండా శ్మశానంలో దహనం చేశారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా, గత నెల 27వ తేదీన మహమ్మద్ అలీ కనిపించటంలేదని ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన ఒకటో పట్టణ పోలీసులు సినీ తరహాలో జరిగిన ఈ హత్యకేసును ఛేదించారు. ఈ హత్యకేసులో 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ చెప్పారు. ఒకటో పట్టణ పోలీసులను ఎస్పీ ప్రశంసించారు.
" సినిమా తరహాలో తన స్నేహితుడు అలీని కొంతమందితో కలిసి రఫీ హత్య చేశాడు. ఈ ఘటనలో 11మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాం." - అన్బురాజన్, అనంతపురం జిల్లా ఎస్పీ
రైలు ఎక్కిస్తానని నమ్మించి గొంతుకోశాడు - కన్నతల్లిని హతమార్చిన తనయుడు