అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ వానరం తన పిల్లతో కలిసి ప్రధాన రహదారిపైకి వచ్చింది. వాటిని చూసిన మూడు శునకాలు దాడికి ప్రయత్నించాయి. తన బిడ్డను ఎలాగైనా వాటినుంచి కాపాడాలనే ఉద్దేశంతో తల్లి వానరం ఆ కుక్కలపై ఎదురుదాడికి దిగింది. ఈ ఘర్షణలో తల్లి వానరం మృతిచెందగా.. పిల్ల కోతి ప్రాణాలు నిలిచాయి.
బిడ్డను రక్షించడానికి తన ప్రాణాలు కోల్పోయిన తల్లి కోతిని చూసి స్థానికులు విచారం వ్యక్తం చేశారు. ఆ వానరానికి సాంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు నిర్వహించారు.
ఇవీ చదవండి...