ETV Bharat / state

పకడ్బందీగా కర్ఫ్యూ... నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు!

కొవిడ్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ రాష్ట్రంలో ప్రశాంతగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకే వ్యాపారులు దుకాణాలు మూసివేస్తున్నారు. ప్రజారవాణా వ్యవస్థ సైతం నిలిచిపోతున్న తీరుతో... రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

author img

By

Published : May 7, 2021, 7:35 PM IST

morning curfew reached third day in andhrapradhesh
ఆంధ్రప్రదేశ్​లో కర్ఫ్యూ

నెల్లూరు జిల్లాలో...

కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న 18 గంటల కర్ఫ్యూ మూడోరోజుకు చేరింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నెల్లూరు నగరంలో కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలవుతోంది. నగరంలో 33 ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేసిన పోలీసులు, రాకపోకలను నియంత్రిస్తున్నారు.

ప్రకాశం జిల్లా...

ఒంగోలు పట్టణంలో పగటి కర్ఫ్యూ దృష్ట్యా... ప్రజలు బయట తిరగకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్నారు. అకారణంగా రోడ్లపైకి వస్తే ఊరుకునేది లేదని చీరాల రెండో పట్టణ సీఐ పాపారావు హెచ్చరించారు. పట్టణంలోని పేరాల వాడరేవు కూడలిలో సీఐ ఆధ్వర్యంలో పికిటింగ్ ఏర్పాటు చేశారు.

అనంతపురం జిల్లాలో...

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు లక్ష మందిపై కేసులు నమోదు చేశామని అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయడం అభినందనీయమన్న ఆయన... అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విశాఖపట్నం జిల్లాలో...

ఏజెన్సీ ప్రాంతం.. పాడేరు పరిసరాల్లో కరోనా కట్టడి చేసేందుకు గ్రామస్థులు రోడ్లపై ముళ్లకంచెలు వేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున ఇలా చేస్తున్నట్లు వారు చెబుతున్నారు.

కర్నూలు జిల్లాలో..

కర్నూలులో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ బీవై రామయ్య విజ్ఞప్తి చేశారు. నగర వాసులు స్వచ్ఛందంగా లాక్​డౌన్ ప్రకటించుకొని కరోనా నియంత్రణకు తోడ్పడాలని కోరారు.

పశ్చిమగోదావరి జిల్లాలో...

జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో మధ్యాహ్నం 12 గంటల అనంతరం వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. అకారణంగా రోడ్లపై తిరుగుతున్న వారికి జరిమానా విధించారు. కర్ఫ్యూ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో వెంటనే.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: ఎమ్మెల్సీ మంతెన

భౌతిక దూరం పాటించమన్నారని పోలీసులపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.