ETV Bharat / state

411 కుటుంబాలకు నిత్యావసర సరకులు అందించిన ఎమ్మెల్సీ

మడకశిర పట్టణంలో రెడ్​జోన్​ తొలగించిన ఆర్యపేట పేట వీధిలోని 411 పేద కుటుంబాలకు తెదేపా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ గుండుమల వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

mlc distributed essential goods to poor people in madakasira town
నిత్యావసర సరుకులు పంచుతున్న తెదేపా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి
author img

By

Published : Jun 20, 2020, 6:25 PM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో రెడ్​జోన్​ తొలగించబడిన ప్రాంతాల్లో తెదేపా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రజలకు నిత్యావసర సరుకులు పంచిపెట్టారు. శ్రీ గుండుమల వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్యపేటలో ఉన్న 411 పేద కుటుంబాలకు సరకులు పంపిణీ చేశారు.

తమ కష్టాలు తెలుసుకొని నిత్యావసరాలు అందించినందుకు ఎమ్మెల్సీకి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి రూ. 5 వేలు అందించి ఆదుకోవాలని తిప్పేస్వామి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఎస్సై రాజేష్​ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

'నిరుపేదల సంక్షేమమే ఆర్డీటీ లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.