MLAs fire on Agriculture Jedi: అనంతపురం జిల్లాలో వర్షాలు మిగిల్చిన నష్టాలపై... జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం వాడీవేడిగా(Minister Botcha Satyanarayana review on damage road) సాగింది. జిల్లా వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ.. వైకాపా ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ ఆగ్రహం(mlas fire on agriculture reports of crop damage in Anantapur) వ్యక్తం చేశారు.
ఈ-క్రాప్(E-CROP) చేయకుండా రైతులకు పరిహారం ఎలా ఇస్తారన్న పయ్యావుల ప్రశ్నకు.. వ్యవసాయశాఖ జేడీ నుంచి సమాధానం రాలేదు. అధికారుల తీరు సరిలేదంటూ అనంత వెంకటరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పప్పుశనగ సాగుచేస్తే..సగం విస్తీర్ణమే చూపడం ఏంటంటూ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అధికారులను నిలదీశారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండా పంట నష్టం అంచనాలు వేస్తే ఇలానే ఉంటుందంటూ మంత్రి బొత్స దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. అధికారులు తీరు మార్చుకోవాలని వ్యవసాయశాఖ జేడీని మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botcha Satyanarayana warned to Agriculture Jedi) హెచ్చరించారు. తక్షణమే సమగ్ర వివరాలతో నివేదిక పంపాలని ఆదేశించారు.
ఇదీ చదవండి..BUILDING COLLAPSE: తిరుపతిలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. పరుగులు తీసిన స్థానికులు