ETV Bharat / state

'ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేది చంద్రన్న కాదమ్మా... జగనన్న!' - ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

అనంతపురం జిల్లాలో జగనన్న ఇళ్ల స్థలాల పట్టాల పేరుతో ప్రభుత్వం ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. లబ్ధిదారులకు పట్టాలు ఇస్తున్న క్రమంలో ఓ మహిళ చెప్పిన సమాధానంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేతో సహా అధికారులు అవాక్కయ్యారు.

mla siddha reddy shocked with women answer at tanakallu mandal
మహిళ సమాధానంతో అవాక్కైన ఎమ్మెల్యే
author img

By

Published : Dec 27, 2020, 1:02 PM IST

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం

అనంతపురం జిల్లా తనకల్లు మండల కేంద్రంలో ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి... ఈశ్వరమ్మ అనే మహిళకు పట్టా అందిస్తూ.. ఈ ఇళ్ల పట్టాలు ఎవరిస్తున్నారని అడగ్గా... ఆమె చంద్రన్న అని సమాధానమిచ్చింది. ఈ అనుకోని పరిణామానికి ఎమ్మెల్యే, అధికారులు అవాక్కయ్యారు. లబ్ధిదారులు ఒక్కసారిగా గొల్లున నవ్వారు. వేదికపై ఉన్న ఎమ్మెల్యే, అధికారులు వారితో పాటు నవ్వుతూ చంద్రబాబు కాదు.. జగనన్న ఇస్తున్నాడని చెప్పాలని సూచించారు.

ఇదీ చదవండి: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.