అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని తెదేపా నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైకాపాకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్ పైనే అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా వివర్శలు చేశారని అన్నారు.
ఎన్నికల కమిషనర్ ఒక్కరే.. మొత్తం వైకాపా నాయకులకు సమాధానం చెప్పారని.. సుప్రీం కోర్టు తీర్పే ఇందుకు నిదర్శనం అని చెప్పారు. సీఎంకు ఎవరి మాటా వినే ఓపిక లేదని పయ్యావుల విమర్శించారు. మంత్రులకు మంచి, చెడు తెలిసినా.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. జగన్కు సలహాలు ఇస్తే ఎక్కడ పదవి పోతుందో అని మంత్రుల భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరికీ భయపడకుండా గెలుపే లక్ష్యంగా పంచాయతీ ఎన్నికల్లో పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: