కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దని, అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సూచించారు. అనుమానితులు ఎవరినీ ఉపేక్షించకూడదని, అవసరమైతే క్వారంటైన్ కి పంపాలని అధికారులను ఆదేశించారు.
కంటైన్ మెంట్ జోన్ లో ఉన్న వారికి నిత్యావసర సరకులు, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రశాంతంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ లు వాడాలని విజ్ఞప్తి చేశారు. భౌతిక దూరాన్ని పాటించాలని ప్రజలకు సూచించారు.
ప్రతి ఒక్కరూ హోమియోపతి మాత్రలను మూడు రోజుల పాటు వేసుకోవాలని, వాటిని కూడా నేరుగా ప్రజల ఇంటికే చేరుస్తామని చెప్పారు. అందరూ ధైర్యంగా ఉండి అధికారులకు, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.