ETV Bharat / state

శివమొగ్గ పేలుళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు: కాపు రామచంద్రారెడ్డి - rayadurgam updates

కర్ణాటకలోని శివమొగ్గ పేలుళ్లలో తన ప్రమేయమేమి లేదని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తనపై అభాండాలు వేయడం దారుణమన్నారు. ప్రాణాలు పోయినా రాయదుర్గం ప్రజలకు నష్టం కలిగించే పని తాను చేయనన్నారు.

mla kapu ramchandareddy
శివమొగ్గ పేలుళ్లతో నాకు ఏలాంటి సంబంధం లేదు: కాపు రామచంద్రారెడ్డి
author img

By

Published : Feb 9, 2021, 7:21 AM IST

కర్ణాటకను అట్టుడికించిన శివమొగ్గ పేలుళ్లలో తన ప్రమేయమేమీ లేదని రాయదుర్గం ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక పోలీసులు అరెస్ట చేసిన మంజునాథ సాయి, శ్రీరాములు ఇద్దరు కూడా కరడుగట్టిన తెదేపా వాదులన్నారు.

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అండదండలతో వారి పేలుడు పదార్థాల వ్యాపారం అభివృద్ధి చేసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. కాల్వ శ్రీనివాసులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తనపై అభాండాలు వేయడం దారుణమన్నారు. ప్రాణాలు పోయినా రాయదుర్గం ప్రజలకు నష్టం కలిగించే పని తాను చేయనని చెప్పారు.

ఇదీ చదవండి: 'శివమొగ్గ పేలుళ్లలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి హస్తం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.