అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో బాలిక అపహరణ వ్యవహారం కలకలం రేపింది. గురువారం రాత్రి పొద్దుపోయాక ముగ్గురు యువకులు బాలికను ఇంటి నుంచి అపహరించుకెళ్లారు. బాలిక ఇంటి నుంచి తీసుకువెళ్లే సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో ఉంచిన నిందితులు.. బయట నుంచి తలుపులు వేశారు. బాధితుల బంధువుల ఫిర్యాదుతో.. కిడ్నాపర్లను 150 కిలోమీటర్లు వెంటాడిన పోలీసు బృందాలు.. వారిని తెల్లవారు జామున మూడు గంటల సమయంలో వారిని పట్టుకున్నారు.
ప్రేమ వ్యవహరమే కారణమా?
బాలిక అపహరణకు మరొకరు సహకరించినట్లు తెలుస్తోంది. నిందితులు కదిరి గోరంట్ల ప్రాంతాలకు చెందినవారిగా తెలుస్తోంది. వారి వద్ద నుంచి స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ అయిన బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిసింది. కిడ్నాప్‌నకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: దారుణం: యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు