కరోనా వైరస్ పట్ల అలసత్వంగా ఉండకూడదని మంత్రి శంకర్నారాయణ ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో విద్యార్థినులకు మాస్కుల పంపిణీ చేశారు.
పాఠశాలలు పునఃప్రారంభమైనందున ప్రతి ఒక్క విద్యార్థి జాగ్రత్తగా మెలగాలన్నారు. వ్యక్తిగత శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నిత్యం మాస్కు ధరించటం వల్లే తాను ఇప్పటివరకు కరోనా బారిన పడకుండా ఉన్నానని మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి: