రైతుల పక్షపాతిగా ఉంటూ రైతుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అనంతపురంలో కొంతమంది తెదేపా నాయకులు సదస్సును ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు సమస్యల గురించి ఆలోచించిన వ్యక్తి కాదన్న మంత్రి.. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎక్కువ పంటలు వచ్చేలా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
తెదేపా నాయకులకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సంక్షేమానికి అన్ని విధాలుగా సాకారం ఇస్తున్నామన్న శంకర్ నారాయణ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని గత ప్రభుత్వంలో వీరు చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు.
హంద్రీనీవా ప్రాజెక్టుకు రూ.ఆరు వేల కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గతంలో కేవలం రూ.9 కోట్లతో పనులు చేపట్టి తాగునీటికి మాత్రమే సరిపడేలా కుట్ర చేశారని ఆరోపించారు. ప్రజలు తమ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: