ETV Bharat / state

'ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి చూసి ఓర్వలేకే తెదేపా నిరసనలు' - మంత్రి శంకరనారాయణ తాజా వార్తలు

తమ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి చూసి ఓర్వలేకే తెదేపా నేతలు నిరసనలు చేస్తున్నారని మంత్రి శంకర నారాయణ అన్నారు. ఇసుక విధానంపై వారి ఆందోళనలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

అనంతపురంలో మంత్రి శంకరనారాయణ మీడియా సమావేశం
author img

By

Published : Oct 26, 2019, 9:04 PM IST

ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంపై తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి శంకర నారాయణ విమర్శించారు. అనంతపురం ఆర్​అండ్బీ వసతి గృహంలో మాట్లాడిన ఆయన... ఐదేళ్లు అధికారంలో ఉన్న తెదేపా నేతలు ఎంత అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారో ప్రజలకు తెలుసన్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలను చూసి ఓర్వలేకే ఇలాంటి ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక విధానంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. తెదేపా, జనసేన పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు.

ఇవీ చదవండి:

'ఈ దీపావళి కార్మికుల, కర్షకుల జీవితాల్లో వెలుగులు నింపాలి'

Intro:ATP :- జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ఈనెల 31న అనంతపురం జిల్లాకు వస్తున్నట్లు మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. అనంతపురంలోని ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశంతో పాటు, నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరుగు కార్యక్రమాలు పాల్గొంటారని చెప్పారు.

Body:అనంతరం మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఇసుక విధానంపై నిన్న తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఐదు ఏళ్లు అధికారంలో ఉండి ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో ప్రజలకు బాగా తెలుసన్నారు. అవినీతి అక్రమాలకు తావులేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల చూసి ఓర్వలేక ప్రజలను మభ్యపెట్టడానికి తెదేపా నాయకులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఇసుక విధానంపై పవన్ కళ్యాణ్ మాట్లాడటం వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని ప్రస్తుత అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

బైట్స్..... శంకర్ నారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి,

2... అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం అర్బన్, ఎమ్మెల్యే

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.