అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.3 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 50 పడకల భవనానికి.. మంత్రి శంకర్ నారాయణ భూమి పూజ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అధికారి నియంతలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక పార్టీకి కొమ్ము కాస్తూ.. వారికి లబ్ధి చేకూర్చడానికే ఆగమేఘాల మీద ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు.
ఏకపక్ష నిర్ణయాలతో ఉద్యోగులు, ప్రజలను ఎస్ఈసీ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యస్ఫూర్తికే విరుద్ధమంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై మండిపడ్డారు. ఒకపక్క ప్రజల స్వేచ్ఛను హరిస్తూ.. నియంతృత్వ పోకడలతో ఎన్నికలు నిర్వహించడం సమంజసమేనా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: