విద్యార్థి వసతి గృహాల్లో కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. మరో మంత్రి శంకర నారాయణతో కలిసి అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన.. బీసీ సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి రోజూ హాస్టల్ గదులను శానిటైజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దఎత్తున కృషి చేస్తోందని చెప్పారు. బీసీ సంక్షేమం రాష్ట్రంలో కీలకమైనశాఖ అని, వెనుకబడిన కులాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి గోపాలకృష్ణ వెల్లడించారు.
ఇదీ చదవండి: