విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనంతపురంలో వైకాపా కార్యకర్తలతో ఎన్నికల గురించి సమావేశమైన అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడం బాధాకరమన్నారు.
ఈ విషయంపై ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని బొత్స తెలిపారు. పరిశ్రమను నష్టాల నుంచి గట్టెక్కించటానికి ప్రధానికి సీఎం జగన్ రెండు మార్గాలు సూచించారని వెల్లడించారు. 2017లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.. ఉక్కు కర్మాగారంలో పెట్టుబడులు ఉపసంహరణ నిర్ణయం జరిగినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఎస్బీఐ రూ. 5 లక్షల విరాళం