ETV Bharat / state

'సీబీఐ దర్యాప్తుతో న్యాయం జరుగుతుంది' - డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పుపై కదిరి తెదేపా నేతల హర్షం

డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. న్యాయం జరుగుతుందని తెదేపా నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ అనంతపురం జిల్లా కదిరిలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

milk annointed to doctor ambedkar in kadiri ananthapuram district
కదిరిలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం
author img

By

Published : May 23, 2020, 5:19 PM IST

ఎస్సీ ,ఎస్టీలకు న్యాయం జరుగుతోందంటే అది రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చలవేనని.. అనంతపురం జిల్లా కదిరి తెదేపా ఎస్సీ సెల్ నాయకులు అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

వైద్యులకు రక్షణ సామగ్రి సరఫరా చేయాలన్న డాక్టర్ సుధాకర్​పై ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరించడం బాధాకరమన్నారు. ఆయన కేసును సీబీఐకి అప్పగించాలి అన్న హైకోర్టు తీర్పుతో న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

వలస కార్మికుల దైన్యం... సొంత గ్రామాల్లోకి అనుమతించని గ్రామస్థులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.