అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం నుంచి ముంబైకి ఉపాధి నిమిత్తం వెళ్లిన వలస కార్మికులు తిరిగి స్వగ్రామాలకు చేరారు. లాక్డౌన్ కారణంగా పనుల్లేక, పస్తులుండలేక.. ఆర్థికంగా కష్టాలు పడిన నాగి నాయని చెరువు తండా, వెలగ మేకల పల్లి, మేకల పల్లి తండా, సోమందేపల్లి ఎస్సీ కాలనీకు చెందిన 29 మంది వలస కూలీలు ప్రత్యేక బస్సులో సోమందేపల్లికి చేరుకున్నారు.
ముంబై నుంచి బయలుదేరిన బస్సు అర్థరాత్రి చేరుకుంది. వలస కార్మికులందరికీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో బస ఏర్పాటు చేశారు. వారితో మాట్లాడిన ఎస్సై.. అందరికీ సౌకర్యాలు కల్పిస్తామని.. పొరపాటు కూడా బయటకు వెళ్లి గ్రామస్థులను, బంధువులను కలవకూడదని చెప్పారు. ఆరోగ్య అధికారులు వచ్చి కరోనా పరీక్షలు నిర్వహిస్తారని.. అంతవరకు క్వారంటైన్ దాటి బయటకు వెళ్లకూడదన్నారు. గ్రామస్థులు సైతం తమ బంధువుల కోసం క్వారంటైన్ కేంద్రాలకు రాకూడదని సూచించారు.
ఇదీ చదవండి: