స్వగ్రామంలో పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, నూతన ఆలయాల ప్రారంభోత్సవం చేపట్టిన మాజీ మంత్రి రఘువీరారెడ్డికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఆలయాలతో.. ప్రారంభోత్సవంతో కొత్త దైవ కార్యానికి శ్రీకారం చుట్టిన రఘువీరారెడ్డికి వీడియో సందేశం ద్వారా ప్రశంసలు గుప్పించారు.
తన రాజకీయ ప్రస్థానంలో అనతికాలంలోనే రఘువీరారెడ్డి తనకు మంచి మిత్రుడయ్యారని మెగాస్టార్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో నేటి నుంచి 5 రోజుల పాటు ఆలయాల ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. కరోనా వల్ల ప్రారంభోత్సవానికి రాలేకపోతున్నానని... పరిస్థితులు కుదుటపడ్డాక కచ్చితంగా వస్తానని చిరంజీవి చెప్పారు.
ఇదీ చదవండి: