అనంతపురం జిల్లా గుంతకల్లులో మందుల దుకాణ యజమానులు ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొంటున్నారు. తాము అమ్మే ట్యాగ్ కొనుక్కుంటే కరోనా అంతం అవుతుందని ప్రజలను మోసగిస్తున్నారు. వైరస్ షట్ ఔట్-మేడిన్ జపాన్ అంటూ ఓ ఐడీ కార్డులాంటి ట్యాగ్ లు ప్రజలకు విక్రయిస్తున్నారు. దీనిని మెడలో ధరిస్తే కరోనా మీ దరి చేరదూ అంటూ మాయ మాటలు చెబుతున్నారు. అసలే కరోనా భయంతో ఉన్నామని...ఈ ట్యాగ్ ధరిస్తే కరోనా సోకదని చెబితే ముందు జాగ్రత్తగా కొనుక్కుంటున్నామని ప్రజలు చెబుతున్నారు. దీనిపై జన విజ్ఞాన వేదిక సభ్యులు స్పందించారు. ట్యాగులో ఏముందోనని తెరిచి చూడగా ఓ చిన్న సాచట్...అందులో ఇసుకలాంటి పొడి ఉన్నట్లు సభ్యులు గుర్తించారు. అసత్య ప్రచారాలతో...గుడ్డి నమ్మకాలతో ట్యాగులు ధరించి విచ్చలవిడిగా జనాల్లో తిరిగితే వైరస్ ఇంకా ప్రబలే అవకాశముందని హెచ్చరించారు. వైరస్ కు ఇంకా వ్యాక్సిన్ రాలేదని... దాని బారి నుంచి తప్పించుకోవాలంటే మాస్క్, సామాజిక దూరం, శానిటైజర్ వంటి జాగ్రత్తలే మార్గమని స్పష్టం చేశారు. ప్రజలే చైతన్యంతో అమ్మకం దారులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
కరోనాకు మందు అంటూ మోసం..'కరోనా షట్ ఔట్-మేడిన్ జపాన్' పేరుతో విక్రయం - గుంతకల్లు కరోనా వార్తలు
కరోనా వ్యాప్తిపై రోజూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మాత్రం చైతన్యం రావట్లేదు. అసలే వైరస్ ధాటికి జనం అల్లాడిపోతుంటే వారి భయాలను బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు ఔషధ దుకాణదారులు. ఐడీ కార్డులాంటి ట్యాగ్..అది మెడలో ధరిస్తే ఇక కరోనా రాదు...అది రానివ్వదు అంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగింది.
అనంతపురం జిల్లా గుంతకల్లులో మందుల దుకాణ యజమానులు ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొంటున్నారు. తాము అమ్మే ట్యాగ్ కొనుక్కుంటే కరోనా అంతం అవుతుందని ప్రజలను మోసగిస్తున్నారు. వైరస్ షట్ ఔట్-మేడిన్ జపాన్ అంటూ ఓ ఐడీ కార్డులాంటి ట్యాగ్ లు ప్రజలకు విక్రయిస్తున్నారు. దీనిని మెడలో ధరిస్తే కరోనా మీ దరి చేరదూ అంటూ మాయ మాటలు చెబుతున్నారు. అసలే కరోనా భయంతో ఉన్నామని...ఈ ట్యాగ్ ధరిస్తే కరోనా సోకదని చెబితే ముందు జాగ్రత్తగా కొనుక్కుంటున్నామని ప్రజలు చెబుతున్నారు. దీనిపై జన విజ్ఞాన వేదిక సభ్యులు స్పందించారు. ట్యాగులో ఏముందోనని తెరిచి చూడగా ఓ చిన్న సాచట్...అందులో ఇసుకలాంటి పొడి ఉన్నట్లు సభ్యులు గుర్తించారు. అసత్య ప్రచారాలతో...గుడ్డి నమ్మకాలతో ట్యాగులు ధరించి విచ్చలవిడిగా జనాల్లో తిరిగితే వైరస్ ఇంకా ప్రబలే అవకాశముందని హెచ్చరించారు. వైరస్ కు ఇంకా వ్యాక్సిన్ రాలేదని... దాని బారి నుంచి తప్పించుకోవాలంటే మాస్క్, సామాజిక దూరం, శానిటైజర్ వంటి జాగ్రత్తలే మార్గమని స్పష్టం చేశారు. ప్రజలే చైతన్యంతో అమ్మకం దారులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇవీ చూడండి-కష్టమంటే చాలు.. ఇంట్లో మనిషైపోతున్నాడు సోనూసూద్