అనంతపురం శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో భారీ చోరీ జరిగింది. నిత్యం రద్దీగా ఉండే ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో కొత్తగా ఏర్పాటు చేసిన కంప్యూటర్లలోని విడిభాగాలను దుండగులు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు 182 కంప్యూటర్ల విడిభాగాలను దోచుకెళ్లారు. సీపీయూలోని మదర్ బోర్డు, ర్యామ్, హార్డ్ డిస్క్ లను దొంగిలించినట్లు డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఈ వస్తువుల విలువ రూ. 35 లక్షలు ఉంటాయని వెల్లడించారు.
స్థానిక పోలీసులు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అధికారుల హస్తంతోనే దుండగులు కంప్యూటర్ విడిభాగాలను తీసుకెళ్లారని యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కంప్యూటర్ విడిభాగాల చోరీలో అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి: