అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని శివరాంపేట గ్రామానికి చెందిన జానకిరామ్ (76) అనే వ్యక్తి కరోనా సోకిందనే భయంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మందులు తెచ్చేందుకు భార్య బయటకెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి కరోనా ఉందని అనుమానంతో మధ్యాహ్నమైనా కిందకు దించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో.. విషయం తెలుసుకున్న కూడేరు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. డాక్టర్ లక్ష్మీనారాయణ, ఎమ్మార్వో సమక్షంలో మృతుని అంతిమ సంస్కారాలకు పీపీఈ కిట్లు అందించారు. మృతుని భార్య లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడేరు ఎస్సై యువరాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
బ్లాక్ ఫంగస్ పంజా: 'మహా'లో 2వేల కేసులు
ఇరువర్గాల ఘర్షణలో వ్యక్తికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు