అనంతపురం ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. డోన్ ప్రాంతానికి చెందిన రఘురామయ్య అనారోగ్యంతో ఉన్న కారణంగా.. తమ బంధువులతో కలిసి రాత్రి రెండు గంటల సమయంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. కరోనా ఉందనే అనుమానంతో వైద్యులు అతనికి చికిత్స చేయడానికి నిరాకరించారు.
ఈ కారణంగా.. ఇతర ఆసుపత్రులకు తిరగాల్సి వచ్చిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైద్యం అందక ఉదయం రఘురామయ్య మరణించినట్లు బంధువులు చెప్పారు. ఈ మరణానికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు.. ఒక్క రోజులోనే 43 మరణాలు