ETV Bharat / state

భార్య వేధిస్తోందని గాజు ముక్కతో గొంతుకోసుకున్న భర్త - Anantapur District Kadiri Crime News

ఓ వ్యక్తి భార్యతో గొడవ పడి గాజు సీసా ముక్కతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భార్య వేధిస్తోందని గాజు ముక్కతో గొంతుకోసుకున్న భర్త

author img

By

Published : Dec 1, 2020, 8:49 PM IST

Updated : Dec 1, 2020, 10:48 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని స్థానికులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీశారు.

అసలు ఏమీ జరిగిందంటే?

శివశింకర్ కడప జిల్లా రాయచోటి మండలం కె.రామాపురానికి చెందిన వ్యక్తి. సెలూన్ దుకాణంలో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్యతో గొడవపడిన ఈయన అనంతపురం బస్సు ఎక్కి కదిరి చేరుకున్నాడు. మనస్తాపంతో గాజు సీసా ముక్కతో వలీసాబ్​ రోడ్డులో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు.

రక్తమడుగులో ఉన్న శివశంకర్​ను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో బాధితుడిని కదిరి ప్రభుత్వాసుపత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్య వేధించటంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితుడు తెలిపాడని పోలీసులన్నారు.

ఇవీ చదవండి

పట్టు రీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన

Last Updated : Dec 1, 2020, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.