ETV Bharat / state

జల్సాల కోసం ద్విచక్రవాహనాల దొంగతనాలు.. నిందితుడు అరెస్ట్

author img

By

Published : Jun 26, 2021, 8:08 AM IST

సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు ముగ్గురు వ్యక్తులు. అందుకు దొంగతనాలే ఉత్తమం అనుకున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు, పలు జిల్లాల్లో ద్విచక్రవాహనాలను దొంగతనం చేయటం అలవాటు చేసుకున్నారు. వాటిని తక్కువ ధరకు విక్రయిస్తూ... జల్సాలకు అలవాటు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిలో ఒకరిని పట్టుకున్నారు.

Man arrested for stealing bikes
పోలీసుల అదుపులో నిందితుడు

వివిధ రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనాలను దొంగలించి, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తున్న దొంగను కదిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో నివాసం ఉంటున్న నూర్‌మహమ్మద్‌.. పాత నేరస్థులైన షేక్‌ ఇలియాజ్‌, అతడి మిత్రుడు సుబహాన్‌ జల్సాలకు అలవాటు పడ్డారు. వీరు ముగ్గురూ సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో అనంతపురం, కడప జిల్లాలతో పాటు కర్ణాటక ప్రాంతంలో ద్విచక్ర వాహనాలను అపహరించి సొమ్ము చేసుకున్నారు.

శుక్రవారం పోలీసులకు అందిన సమాచారం మేరకు సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సై వెంకటరమణ తదితరులు కుమ్మరవాండ్లపల్లికి చేరుకుని ద్విచక్రవాహనం అమ్ముతున్న నూర్‌మహమ్మద్‌ను అరెస్టు చేశారు. ఇంట్లో దాచి ఉన్న 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలియాజ్‌, సుబహాన్‌పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. త్వరలోనే వారిద్దరినీ అరెస్టు చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆగ్రహం.. మామ, కూతురిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.